Site icon Bhakthi TV

శివునికి శిరోభూషణం.. శ్రీహరికి వాహనంగా మారిన చంద్రుడు..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్ర‌భ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు.

చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

ఆకట్టుకున్న 9 రాష్ట్రాల కళా ప్రదర్శనలు

చంద్రప్రభ వాహనం సేవలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల నుండి వచ్చిన 21 కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కళాకారుల అద్భుత ప్రదర్శనలు వాహన సేవలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచాయి. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి 21 బృందాలలలో491 మంది కళాకారులు భరతనాట్యం, మోహినియాట్టం, కథాకళి, గౌడీయ నృత్యం, కృష్ణ మహీమ, గంగావతార్ రూపకం, శ్రీ రుక్మిణీశ విజయ, రసమయి గోవింద స్మృతి, మంజునాథ చరితం ప్రదర్శించారు. ఉత్తరాఖండ్ కు చెందిన కళాకారులు జానపద నృత్యాలు, హరుల్ చోళియ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళాకారుల కోలాటం, మహారాష్ట్ర – వారాకరీ భజన, జానపద నృత్యం, బతుకమ్మ, భాంగ్రా భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా గోదాదేవి కళ్యాణం, అష్టలక్ష్ములు, అళ్వార్ వేశ ధారణ, డ్రమ్స్ ప్రదర్శన భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించాయి.

Share this post with your friends
Exit mobile version