
తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు విభాగాలకు ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు శ్రీ ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డిడిలను దాత అందజేశారు. టీటీడీలోని వివిధ ట్రస్ట్ లకు విరాళాలు అందించిన దాతను టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభినందించారు. అనంతరం ఆనంద్ మోహన్ శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు,
రూ.1,00,01,116.
ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు
రూ. 10,01,116,
ఎస్వీ విద్యా దాన ట్రస్ట్‌కు
రూ.10,01,116,
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు,
రూ. 10,01,116,
ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు
రూ.10,01,116.
