Site icon Bhakthi TV

హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి?

హనుమంతుని పుట్టినరోజును మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. ఈ పవిత్రమైన పండుగ రోజున హనుమంతుడిని పూజిస్తే జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంటిలో ఆనందం, శ్రేయస్సు, మానసిక, శారీరక బలం కావాలంటే హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ఇక హనుమాన్ జయంతిని ఏప్రిల్ 12న జరుపుకోనున్నాం. హనుమాన్ జయంతి రోజున ఎలా పూజ చేసుకోవాలంటే… బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎరుపు లేదంటే నారింజ రంగు దుస్తులు ధరించాలి. అనంతరం పూజ చేసే ప్రాంతంలో గంగాజలంతో శుద్ధి చేయాలి.

ఒక పీటం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి గుడ్డను పరిచి దానిపై హనుమంతుని విగ్రహం లేదా చిత్రపటంతో పాటు సీతారాముల చిత్రపటాన్ని కూడా ఉంచాలి. అనంతరం పూజకు కావల్సినవన్నీ సిద్ధం చేసుకోండి. సింధూరం, మల్లె నూనె, ఎర్రటి పువ్వులు, వడమాల, పవిత్ర దారం, కలశం, ధూపం, దీపం, కర్పూరం, కొబ్బరి కాయతో పాటు నైవేద్యాలను సిద్ధం చేసుకోండి. ముందుగా గంగా జలం, బియ్యం, పువ్వులను చేతిలో పట్టుకుని మనసులో కోరికను చెప్పి పూజ చేయండి. అయితే ముందుగా సీతారాములను పూజించిన మీదటే ఆంజనేయుడిని పూజించాలి. హనుమంతుడి విగ్రహాన్ని గంగాజలంతో స్నానం చేయించి సింధూరం పెట్టండి. అనంతరం కొత్తబట్టలు, పూజా దారం ధరింపజేసి పువ్వులు దండను వేయండి. అనంతరం నైవేద్యాలను సమర్పించి మల్లె నూనెతో దీపం వెలిగించి హారతి ిస్త పూజ పూర్తైనట్టే.

Share this post with your friends
Exit mobile version