Site icon Bhakthi TV

ఈ వినాయకుడు ఎంత స్పెషల్ అంటే.. ఒక్క ఫోన్ చేస్తే చాలు..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఎన్నో ఆలయాలున్నాయి. కొన్ని ఆసక్తికర ఆలయాలు సైతం ఉన్నాయి కదా. భక్తులు ఎక్కువగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో చింతామణి గణేష్ ఆలయం ఒకటి. ఈ పుణ్యక్షేత్రం విశేషమేంటో తెలిస్తే ఎంత షాక్ అవుతారు. అదేంటో తెలుసుకుందాం. చింతామణి గణేష్ ఆలయం ఈనాటిది కాదు.. 11 – 12 శతాబ్దాల నాటి జలప్రళయానికి ముందుదని చెబుతారు. మరి దీనిని ఎవరు నిర్మించారంటారా? పరమారాస్ పాలనలో పూర్తిగా రాతితో నిర్మించారట. అప్పటి ఆలయం అయినా కూడా దాని ఆకర్షణను నేటికీ కోల్పోలేదు. ఈ ఆలయంలో వినాయకుడిని ‘చింతాహరన్’ అని పిలుస్తారు.

చింతాహరన్ అంటే చింతలను హరించేవాడని అర్థం. ఈ గణేషుడికి మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే చాలు.. చింతలన్నీ హరించేస్తాడట. అసలు అప్పట్లో ఫోన్లు అంతగా అందుబాటులో లేవు కదా.. మరి ఈ సంప్రదాయం ఎలా మొదలైందా? అనుకుంటున్నారా? అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి తమ సమస్యలను తెలియజేస్తూ లేఖలను రాసేవారట. కాలం గడిచేకొద్దీ స్వామివారికి కమ్యూనికేషన్ చేసే విధానం మారిపోయింది. ఇప్పటికీ ఈ చింతామణి వినాయకుడి గురించి తెలిసిన వారంతా దూరంలో ఉంటే కాల్ చేసి తమ సమస్యను చెప్పుకుంటారు. అలా చెబితే తప్పక సమస్య తీరిపోతుందట.

Share this post with your friends
Exit mobile version