Site icon Bhakthi TV

17 నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది భక్తులు దర్శించుకున్నారంటే..

అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణమనేది భారతీయుల చిరకాల కల. అది 17 నెలల క్రితం సాకారమైంది. అప్పటి నుంచి రామయ్య భక్తులు పెద్ద ఎత్తున రాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయోధ్య రామమందిరం 2024 జనవరి 22న ప్రారంభమైంది. నాటి నుంచి ఎంతమంది భక్తులు రామయ్యను దర్శించుకున్నారనే వివరాలను ఆలయ అధికారులు తాజాగా వెల్లడించారు. అయోధ్య రామయ్యను ఐదున్నర కోట్ల మంది దర్శించుకున్నారు. అలాగే వీఐపీలు వచ్చేసి నాలుగున్నర లక్షల మంది దర్శించుకున్నారు. వీఐపీలో వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కేంద్ర, రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.

ఎలన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ సహా ఎందరో విదేశీయులు సైతం భారీగా అయోద్య రామయ్యను దర్శించుకుని పూజలు నిర్వహించారు. రోజుకు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నా వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టెంపుల్ ట్రస్ట్ ఏర్పాట్లు నిర్వహిస్తోంది. పండుగ సమయాల్లో అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. వచ్చిన భక్తులంతా స్వామివారి వివిధ పూజా కార్యక్రమాలను కన్నులారా వీక్షించి వస్తున్నారు. కేవలం 17 నెలల్లో ఇన్ని ఐదున్నర కోట్ల మంది బాల రామయ్యను దర్శించుకోవడమంటే సాధారణ విషయం కాదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version