Site icon Bhakthi TV

ఘనంగా పంచమూర్తుల తిరువీధి ఉత్సవం..

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా పవిత్రోత్సవాలు జరిగాయి. జూలై 7న ప్రారంభమైన ఈ ఉత్సవాలు నిన్నటితో ముగిశాయి. బుధవారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు అర్చకులు, వేద పండితులు ముగింపు పలికారు. అంతకు ముందు రోజు ఉదయం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక నిన్న ఉద‌యం మ‌హా పూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం యాగశాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు. మధ్యాహ్నం 03.00 – 03.30 గం.ల మధ్య అభిషేకం, అనంతరం అలంకారం, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వ‌హించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.

Share this post with your friends
Exit mobile version