Site icon Bhakthi TV

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమల క్షేత్రం తరహాలో రూపుదిద్దుకున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి ప్రస్తుతం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఎంఎంటీఎస్ సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రణాళికను రైల్వే అధికారులు రూపొందించారు. ఎట్టకేలకు దశాబ్దాల నిరీక్షణకు ఫలితం లభించనుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. ఆ తరువాత ఆలయ పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చించి చాలా వరకూ పనులు పూర్తి చేశారు.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సైతం యాదాద్రిని అలా వదిలేకుండా పనులన్నీ పూర్తి చేయిస్తూ దేశంలోనే ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ పునర్నిర్మాణం తరువాత భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే యాదగిరి గుట్టకు సరైన వాహన సౌకర్యం లేక భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తే.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. 2004 నుంచి 2016 వరకు సీఎం లందరూ ఎంఎంటీఎస్ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ నిధులు లేక పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు అమృతా భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తైంది. జూన్‌లోనే పనులు ప్రారంభం కానున్నాయి.

Share this post with your friends
Exit mobile version