Site icon Bhakthi TV

చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త

చార్‌ధామ్ యాత్రకు సమయం ఆసన్నమవుతోంది. ఈ యాత్రకు వెళ్లాలనుకున్న భక్తులంతా ఇక సిద్ధం కావచ్చు. యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు యాత్ర ట్రస్ట్ శుభవార్త చెప్పింది. భక్తులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొంతమంది భక్తులకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం రాదు. ఈ క్రమంలోనే అటువంటి వారంతా ఇక మీదట ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభం కానుంది. బద్రీనాథ్ తలుపులు మే 4న తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి నాడు కేదార్‌నాథ్ థామ్ తెరిచే విషయమై నిర్ణయం తీసుకుంటారు.

చార్‌ధామ్ యాత్రకు సంబంధించి యాత్ర ట్రాన్సిట్ క్యాంప్ ప్రాంగణంలో గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రయాణికుల నమోదు విధానంపై మార్పులు చేర్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం రాక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తామని తెలిపారు. చార్‌ధామ్ యాత్ర మార్గాల్లోని అన్ని పనులు ఏప్రిల్ 15 నాటికి పూర్తయ్యేలా చూడాలని ప్రజా పనుల శాఖకు శంకర్ పాండే ఆదేశాలు జారీ చేశారు.

Share this post with your friends
Exit mobile version