Site icon Bhakthi TV

శ్రీశైలం మల్లికార్జునస్వామివారి భక్తులకు గుడ్ న్యూస్

శ్రీశైలం మల్లికార్జునస్వామివారి భక్తులకు గుడ్ న్యూస్. స్వామివారి స్పర్శ దర్శనానికి సంబంధించి శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసనుకుంది. ఇప్పటి వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో ఆలయ అధికారులు స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తూ వస్తున్నారు. ఇక మీదట భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి వీకెండ్స్‌లో అంటే శని, ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ సమయంలో స్వామివారి స్పర్శదర్శనాన్ని ఇప్పటి వరకూ ఆలయ అధికారులు రద్దు చేస్తూ వస్తున్నారు.

రద్దీ వేళ్లలో స్పర్శ దర్శనాలే కాకుండా అభిషేకాలను సైతం నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. భక్తులు మాత్రం తమకు స్పర్శ దర్శనం ఏడాదంతా కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ రోజుల్లో నాలుగు విడతల్లో అలంకార దర్శనం, మూడు విడతల్లో స్పర్శ దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడుతల్లో స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అయితే స్పర్శ దర్శనానికి సంబంధించి ఇక మీదట కరెంట్ బుకింగ్ లేదు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version