Site icon Bhakthi TV

శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న గోమాత

గుడికి వెళ్లడంతోనే వెంటనే దేవుడిని దర్శించుకోము. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తరువాత దేవుడిని దర్శించుకుంటాం. ఇది సర్వసాధారణం. అయితే ఆలయం చుట్టూ కొన్ని సార్లు జంతువులు కూడా ప్రదక్షిణలు చేస్తుంటాయి. ఈ న్యూస్ ప్రతి ఒక్కరూ వినే వఉంటారు. అయితే ఇదంతా భగవంతుడి మహత్స్యంగా భావిస్తాం. తాజాగా ఒక ఆవు ఇలాగే ఆలయంలో ప్రదక్షిణలు చేసింది. ఆ ఆవు ప్రదక్షిణ చేసిన ఆలయం ఎక్కడుందో ముందుగా తెలుసుకుందాం. ఏలూరు జిల్లా నిడమర్రు మండల కేంద్రమైన నిడమర్రులో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.

ఆలయానికి ప్రతిరోజు మండలంలోని అన్ని గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తెల్లవారుజామున ఆలయానికి ఒక ఆవు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. కొన్ని సార్లు ప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి నిలబడి స్వామి వారి మూలవిరాట్టును తీక్షణంగా చూస్తూ స్వామివారిని దర్శించుకుంది. ఆ తరువాత కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గోమాతను చూసిన స్థానికులు, ఆలయానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఇదంతా శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమేనని చెప్పుకుంటున్నారు.

Share this post with your friends
Exit mobile version