Site icon Bhakthi TV

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం

ఆరుద్ర సందర్భంగా కొన్ని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీశైలంలో లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి పెద్ద ఎత్తున స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వేకువజామునే శ్రీ మల్లికార్జునస్వామికి పలు అభిషేకాలు నిర్వహించారు. మల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం సహా పలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

అమ్మవారికి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. స్వర్ణరథాన్ని ఆలయ మాడవీధులలో రాజగోపురం, హరిహరరాయ గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో స్వామివారు విహరించారు. భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు, గిరిజనుల నృత్యాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది. స్వర్ణ రథోత్సవానికి వందలాదిగా స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వర్ణరథోత్సవం తిలకించారు. ప్రతీమాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

Share this post with your friends
Exit mobile version