
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16 నుంచి జరుగనున్నాయి. ఫిబ్రవరి 26 వరకూ ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారు.. రాత్రి 7 గంటలకు అమ్మవారు శ్రీ కోదండరామస్వామి అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు.
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, ఆలయ అర్చకులు ఇతర అదికారులు పాల్గొన్నారు.
