Site icon Bhakthi TV

జూలై 12న అప్పలాయగుంటలో పుష్పయాగం

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జూలై 12వ తేదీ శనివారం పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అర్చకులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. దీనికోసం నేటి (జూలై 11వ తేదీ, శుక్రవారం) రాత్రి 7.30 – 8.00 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 07 నుంచి 15వ తేదీ వరకూ శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

అయితే ఆ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 02.00 నుండి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version