Site icon Bhakthi TV

మహిషాసురమర్ధినిగా ఉగ్రచండికా రూపంలో పూజలందుకున్న దుర్గమ్మ..

నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి నాడు దుర్గమ్మ తల్లి మహిషాసురమర్ధిని – ఉగ్రచండికా రూపంలో పూజలందుకుంది. దుర్గాష్టమి నాడు ఉపవాసం చేసిన వారి పాపాలు నశిస్తాయని నమ్మకం. దీంతో భక్తులంతా ఉపవాసం ఉండటమే కాకుండా హోమాలు నిర్వహించారు. గులాబీ, ఎరుపు పువ్వులు, దీపం, నైవేద్యాలతో పూజ చేస్తే అపార శక్తి లభిస్తుంది. నిన్న చాలా మంది కన్యా పూజ (కన్యకా పూజ) నిర్వహించారు. బాలికలకు పసుపు, కుంకుమ, వస్త్రం, అన్నదానం చేయడం కన్యాదానం వంటివి చేశారు. దుర్గా సప్తశతి, లలితా సహస్రనామ, దుర్గాదేవి అష్టోత్తర పారాయణం గావించారు.

దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు..

వారాణసిలో విశాలాక్షి అమ్మవారికి మహామహోపచారాలు, శక్తి హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

కోల్‌కతాలో దుర్గాపూజ ఘనంగా – విగ్రహాల శోభాయాత్రలు, మహానవరాత్రి సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి.

కామాఖ్యా దేవాలయం (అస్సాం)లో ప్రత్యేక యజ్ఞాలు, రక్తపుష్పాలతో తల్లికి ఆరాధన గావించారు.

మైసూరు చాముండేశ్వరి ఆలయంలో రథోత్సవం, శక్తి ఆరాధన నిర్వహించారు.

హైదరాబాద్‌లో లలితా పీఠాలు, తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో చండీహోమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు.

Share this post with your friends
Exit mobile version