
తిరుమల తిరుపతి దేవస్థానం లేదంటే శ్ర మలయప్ప స్వామివారికి అదీ కాదంటే టీటీడీ ఆధ్వర్యంలో నడపబడుచున్న వివిధ విభాగాలకు దాదాపుగా నిత్యం విరాలాలు అందుతూనే ఉంటాయి. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి శుక్రవారం ఉదయం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలకత్తాకు చెందిన శ్రీ సంజీవ్ గోయెంకా రూ.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వజ్రాలు, రత్నాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు.
అంతకు ముందు రోజు ఓ ఎన్నారై తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్ట్‌లకు పెద్ద మొత్తాన్ని విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు శ్రీ ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టీటీడీలోని వివిధ ట్రస్టులు.. ఎస్వీ ప్రాణదాన, ఎస్వీ గో సంరక్షణ, ఎస్వీ విద్యాదాన, ఎస్వీ వేద పరిరక్షణ, ఎస్వీ సర్వ శ్రేయాస్‌లకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డిడిలను దాత అందజేశారు.
