Site icon Bhakthi TV

దుర్గమ్మ విషయమై చేసే ఆగమన గీతిక, నిగమన గీతిక గురించి మీకు తెలుసా?

బెంగాలీలకు దసరా పండుగ చాలా ప్రత్యేకం. ఇక్కడ జరిపినంత వేడుకగా మరెక్కడా జరుపరంటే అతిశయోక్తి కాదు. శక్తిని పూజించడంలో బెంగాలీయులకే అగ్ర తాంబూలం. మరి అంతలా ఎందుకు బెంగాలీయులు దసరా పండుగ జరుపుకుంటారు? టైటిల్‌లో మనం చెప్పుకున్న ఆగమన, నిగమన గీతిక అంటే ఏంటో తెలుసుకుందాం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించే బెంగాలీలు దసరా సమయంలో మూడు రోజుల పాటు పుట్టింటికి వస్తుందని నమ్ముతారు. శివయ్య తన భార్య దుర్గను, కుమారులైన వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామిని పుట్టింటికి పంపిస్తాడని వారి నమ్మకం.

అందుకే బెంగాలీలు అత్యంత వేడుకగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. దసరా వేడుక సమయంలో దుర్గాదేవిని తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ‘ఆగమన గీతిక’ను ఆలపిస్తారు. తమ ఇంటికి వచ్చిన ఆడపడుచును అత్యంత గౌరవంగా మర్యాదలు నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు అమ్మవారిని పూజించుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన అష్టమి, నవమి తిథుల మధ్య వేళలో దుర్గాదేవికి సంధ్య పూజ చేస్తారు. అనంతరం దశమి నాడు తిరిగి అమ్మవారిని మెట్టినింటికి పంపిస్తారు. మెట్టినింటికి పంపే సమయంలో నిగమన గీతికను ఆలపిస్తారు.

Share this post with your friends
Exit mobile version