Site icon Bhakthi TV

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడకూలి ఏడుగురి మృతి

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఏడాదికోసారి మాత్రమే దర్శనమిచ్చే స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలోనే భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది.

ఈ క్యూలైన్‌లో ఉన్న వారిలో కొందరు ఈ గోడ కింద పడిపోవడంతో ఏడుగురు మరణించగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత సహా విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ఏడుగురి మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Share this post with your friends
Exit mobile version