Site icon Bhakthi TV

భక్తజన సంద్రంగా మారిన కొమురవెళ్లి క్షేత్రం

ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెళ్లి భక్తజన సంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో స్వామివారి నామం మార్మోగింది. తెల్లవారుజామునుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం క్యూలైన్లలో బారులుదీరారు. బోనాలను సమర్పించుకున్నారు. స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి 3 గంటలు, ధర్మ దర్శనానికి ఐదు గంటల సమయం పట్టింది. మల్లన్న గుట్టపై కొలువుదీరిన ఎల్లమ్మ తల్లి కి బోనాలు సమర్పించున్నారు.

Share this post with your friends
Exit mobile version