Site icon Bhakthi TV

బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్..

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల జాతరకు వేళవుతోంది. హైదరాబాద్ ప్రజలంతా ఆనందోత్సాహాల నడుమ ప్రతి ఆదివారం ఈ జాతరను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ క్రమంలోనే జాతర ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ప్రతి ఏటా ఆషాఢమాసంలో ఈ బోనాల జాతర జరుగుతూ ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ఆషాఢం ప్రారంభమవుతుంది.ఈ క్రమంలోనే గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు, సికింద్రాబాద్‌ బోనాల తేదీలను ప్రకటించింది. జూన్ నెలలో బోనాల సంబరాలు మొదలు కానున్నాయి.

ఆషాఢ మాసంలోని తొలి గురువారం లేదా తొలి ఆదివారం గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బోనాల పండుగ మహోత్సవం ప్రారంభమవుతుంది. బంగారు బోనంతో ప్రారంభమయ్యే ఈ జాతర జూన్‌ 26 నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల అనంతరం అంటే జూలై 24వ తేదీతో ముగియనుంది. జూన్‌ 26వ తేదీ గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం.. జూలై 13న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు.. జూలై 20న పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు నిర్వహించున్నారు. జూన్‌ 26న తొలి బోనం .. జూన్ 29న ఆదివారం రెండవ బోనం, జూలై 3వ తేదీ గురువారం మూడవ బోనం, జూలై 6వ తేదీ ఆదివారం నాలుగవ బోనం, జూలై 10వ తేదీ గురువారం ఐదవ బోనం, జూలై 13వ తేదీ ఆదివారం ఆరవ బోనం, జూలై 17వ తేదీ గురువారం ఏడవ బోనం, జూలై 20వ తేదీ ఆదివారం 8వ బోనం, జూలై 24వ తేదీ గురువారం 9వ బోనంతో ఈ పండుగ ముగియనుంది.

Share this post with your friends
Exit mobile version