Site icon Bhakthi TV

శ్రీ పార్థసార‌ధిస్వామి అలంకారంలో చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారు

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వాహన సేవలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. తిరుచానూరు మాదరిగానే ఇక్కడ కూడా శ్రీ పద్మావతి అమ్మవారికి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌నివారం ఉద‌యం 9 గంట‌లకు స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ పార్థ‌సార‌ధిస్వామి అలంకారంలో అమ్మ‌వారు భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 23వ తేదీన ఉదయం సూర్య‌ప్ర‌భ వాహ‌నం, రాత్రి చంద్ర‌ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version