Site icon Bhakthi TV

ఫిబ్ర‌వ‌రి 19 నుంచి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 ఫిబ్ర‌వరి 06: తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 19 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 15న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

19-02-2025

ఉద‌యం – ధ్వజారోహణం

రాత్రి – హంస వాహనం

20-02-2025

ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

21-02-2025

ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం

22-02-2025

ఉద‌యం – మకర వాహనం

రాత్రి – శేష వాహనం

23-02-2025

ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం

24-02-2025

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం

25-02-2025

ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం

26-02-2025

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం

27-02-2025

ఉద‌యం – పురుషామృగవాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం

28-02-2025

ఉద‌యం – త్రిశూలస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం

Share this post with your friends
Exit mobile version