
తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. 2025 -26 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీటీడీ ఆధ్వర్యంలో నడపబడుచున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు (పాఠశాలలు)లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, 3. విజయనగరం, 4. ఐ. భీమవరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండలలోని ఏ వేదపాఠశాలను అయినా విద్యార్థులు ఎంచుకోవచ్చు.
ఆయా వేద పాఠశాలలో బోధింపబడు వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన బాలుర నుంచి అనగా వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కలిగిన వారి నుంచి టీటీడీ దరఖాస్తులు కోరుతోంది. సదరు పాఠశాలల యందు బోధింపబడు వివిధ కోర్సుల వివరాలు, అర్హత, ఆవశ్యకత, దరఖాస్తు, ఇతర వివరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ www.tirumala.org లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు. 2025 మే 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
