శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 01 నుండి 09వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఏప్రిల్ 30నఅంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు భాగంగా ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 01వ తేదీ రాత్రి 09.00 గంటల నుండి 10.30 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 10వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటలవరకు పుష్పయాగం నిర్వహించబడుతుంది.
వాహన సేవల వివరాలు
01-05-2026 – ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం
02-05-2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
03-05-2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
04-05-2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
05-05-2026 – ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహనం
06-05-2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
07-05-2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
08-05-2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
09-05-2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం
ఈ దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపను పొందాలని భక్తులను కోరుతున్నారు.
