Site icon Bhakthi TV

మే 01 నుంచి శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 01 నుంచి శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 01 నుంచి శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 01 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 28వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.

మే 01 నుంచి శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
01-05-2026
ఉదయం – ధ్వజారోహణం( మేష‌లగ్నంలో ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)
రాత్రి – పెద్దశేష వాహనం
02-05-2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
03-05-2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
04-05-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
05-05-2026
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం
06-05-2026
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
07-05-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
08-05-2026
ఉదయం – రథోత్సవం ( ఉద‌యం 6 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు)
సాయంత్రం – ఆర్జితకల్యాణోత్సవం ( సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)
రాత్రి – అశ్వవాహనం
09-05-2026
ఉదయం – చక్రస్నానం (ఉద‌యం 11.30 నుండి 11.45 గంట‌ల వ‌ర‌కు)
రాత్రి – ధ్వజావరోహణం ( రాత్రి 7.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 8వ తేదీన సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version