Site icon Bhakthi TV

6 నుంచి తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 28: తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 5వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

06-03-2025

ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8 నుండి 8.30 గంటల మధ్య మీన లగ్నంలో)

రాత్రి – హంసవాహనం,

07-03-2025

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

రాత్రి – హనుమంత వాహనం

08-03-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సింహ వాహనం

09-03-2025

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – పెద్దశేష వాహనం

10-03-2025

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – గజవాహనం

11-03-2025

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – స‌ర్వ‌భూపాల వాహ‌నం(సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు) కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),
గరుడ వాహనం( రాత్రి 11 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు)

12-03-2025

ఉదయం – రథోత్సవం

రాత్రి – ధూళి ఉత్సవం

13-03-2025

ఉదయం – సూర్యప్రభవాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం (సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు), పార్వేట ఉత్స‌వం( రాత్రి 7 నుండి 8 గంటల వరకు), అశ్వ వాహనం (రాత్రి 8.30 నుండి 10.30 గంటల వరకు)

14-03-2025

ఉదయం – వసంతోత్సవం (ఉదయం 7 నుండి 9 గంటల వరకు), చక్రస్నానం (మధ్యాహ్నం 12.05 గంటలకు)

రాత్రి – ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు)

మార్చి 15వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు.

Share this post with your friends
Exit mobile version