Site icon Bhakthi TV

శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజకు సిద్ధమవుతుండగా ఊహించని ఘటన..

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ప్రత్యేకత వాయులింగమే కాదు.. రాహుకేతువుల పూజ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు వచ్చిన భక్తులంతా దాదాపుగా రాహుకేతు, సర్ప దోష నివారణ పూజలు చేస్తుంటారు. అయితే తాజాగా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో రూ.750 టికెట్ కొనుక్కుని భక్తులంతా రాహుకేతు పూజలో పాల్గొనేందుకు వెళుతున్నారు. అంతే ఊహించని ఘటనతో అంతా షాక్ అయ్యారు. రాహు కేతు పూజలు నిర్వహించే మండపం మెట్ల మీద ఏడు అడుగుల పామును చూసి భక్తులంతా అవాక్కయ్యారు. ఊహించని ఘటనతో అంతా పరుగు లంకించకున్నారు.

వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం అందింది. ఆలయ సీఎస్ఓ సుదర్శన్ రెడ్డి ఫారెస్ట్ అధికారులకు సమచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పామును బంధించి సంచిలో తీసుకుని వెళ్లి రామాపురం అడవుల్లో ఫారెస్ట్ అధికారులు వదిలేశారు. మొత్తానికి పామును సేఫ్‌గా పట్టుకోవడంతో భక్తులు, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు ఆలయంలో కనిపించడం ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆలయంలో పాములు కనిపించాయి. తరువాత తిరిగి పాములు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని భక్తులకు అధికారులు తెలిపారు.

Share this post with your friends
Exit mobile version