Site icon Bhakthi TV

దీపావళి వేళ రామయ్య గురించి ఆసక్తికర ట్వీట్ వైరల్

భారతీయులకు రామాయణం పరమ పవిత్రం. శ్రీరాముడి కథ వింటూ పెరుగుతాం. జీవితంలో ప్రతి క్షణం రామాయణంతో అన్వయించుకుంటాం. శ్రీరాముడు హిందువులందరికీ ఆదర్వం. అయితే దీపావళి రానున్న నేపథ్యంలో శ్రీరాముడి గురించి ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చాలా ఆసక్తికరంగా మారింది. శ్రీరాముడు లంక నుంచి అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజుల పాటు ప్రయాణించాడనేది సదరు ట్వీట్ సారాంశం. అయితే ఓ వ్యక్తి శ్రీలంక నుంచి అయోధ్యకు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని గూగుల్ చేయగా.. 21 రోజుల 10 గంటల సమయం పడుతుందని తెలిసింది.

సదరు నెటిజన్ తాను చేసిన గూగుల్ మ్యాప్‌ను నెట్టింట షేర్ చేశాడు. ఈ ఫోటో షేర్ చేసిన తర్వాత దసరా అనంతరం 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు జరుపుకుంటాం? అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీరాముడు సీతా సమేతుడై పరివారంతో లంక నుంచి అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజులు పట్టింది రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. ఇది నిజమేనాఝ అని గూగుల్ చేయగా రిజల్ట్ చూసిన సదరు నెటిజన్ షాక్ అయ్యాడు. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ కాగా.. నడవడానికి పట్టిన సమయం 504 గంటలు అని తెలిసింది.

Share this post with your friends
Exit mobile version