Site icon Bhakthi TV

ఈ అమ్మవారి పూజకు భక్తులంతా కర్రలను వాడుతారు.. ఈ ఆలయం ఎక్కడుందంటే..

శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తుండటంతో అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజిస్తే మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి సుఖ శాంతులు నెలకొంటాయని నమ్మకం. ఇక అమ్మవారి ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో పూజా విధానం ఉంటుంది. ఓ ఆలయంలో అమ్మవారిని కర్రలతో పూజించడమే కాదు.. కర్రలతో ఆటలాడుతూ ఉంటారు.

మధురలోని కృష్ణ నగరంలో నారీ సెమ్రి అనే దుర్గా దేవి ఆలయం ఉంది. ఇది మహాభారత కాలం నాటి ఆలయమని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో విశేషమేంటంటే ఇక్కడ అమ్మవారి పూజా సమయంలో డప్పులు వాయించరు. కర్రలను వాయిస్తూ ఉంటారు. ఇక్కడి నారి సెమ్రీ అమ్మవారిని ‘నాగర్ కోట్ వలీ దేవి’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం నవరాత్రుల సమయంలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని కర్రలతో పూజిస్తే దుర్గమ్మ ప్రసన్నురాలై ఆమెను పూజించిన భక్తులపై అపారమైన అనుగ్రహం కురిపిస్తుందట.

Share this post with your friends
Exit mobile version