Site icon Bhakthi TV

శ్రీనివాస కళ్యాణోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు

సీఆర్డీఏ పరిధిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ ఆలయంలో మార్చి 15న జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవం ఏర్పాట్లను గురువారం సాయంత్రం రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, ట్రాఫిక్, పార్కింగ్, లైటింగ్, అలంకరణలు, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ, పారిశుద్ధ్య తదితర పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

కల్యాణ వేదిక ప్రాంగణాన్ని మంత్రుల బృందం దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి శ్రీమతి వి.అనిత, రెవిన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ ఎం.శాంతారామ్, శ్రీ ఎం.ఎస్.రాజు, ఈవో శ్రీ జె. శ్యామల రావు, డిఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్, జిల్లా కలెక్టర్ శ్రీ నాగలక్ష్మి, టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం,
ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ తదితర అధికారులు పరిశీలించారు.

Share this post with your friends
Exit mobile version