Site icon Bhakthi TV

ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు

తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహించారు. పురస్కరించుకుని సోమవారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్యాలను అంబారీలపై ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులకు అందించారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీగోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది.

ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఒంటిమిట్ట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు రానున్నారు. ఈ క్రమంలోనే దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు వచ్చి వెళ్లేంత వరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు టీటీడీ సూచనలు చేసింది. హైవే సెక్టార్‌లలో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల నుంచి అంబులెన్స్ లను అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో ఈ ముత్యాల తలంబ్రాలను వినియోగిస్తారు.

Share this post with your friends
Exit mobile version