Site icon Bhakthi TV

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవం..

ప్రతి శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊరేగింపు ఉత్సవం ఉదయం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలోనే నిన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచ్చి వాహనంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి పారవశ్యంతో వీక్షించారు. ఇక శుక్రవారం సాయంత్రం పద్మావతి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులు సైతం హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు అమ్మవారిని తిలకించారు.

భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్థంతి మహోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు సంగీత కచేరి, ఉదయం 11.30 గం.లకు శ్రీ కె. చంద్రశేఖర్ బృందంచే హరికథ, సాయంత్రం సంగీత కచేరి చేపడుతారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలో సాయంత్రం ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం, సంగీత కచేరి, హరికథ నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version