Site icon Bhakthi TV

ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం

తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా బుధవారం గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం, 8 నుండి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం జరిపారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆతరువాత భక్తులకు శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేశారు . సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు అథితులు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version