
పేదల తిరుపతిగా పేర్కొనే మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మహబూబ్‌నగర్ ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రత్యేక మినీ బస్సులను నడిపేందుకు ఏర్పాటు చేసింది. మార్చి 13వ తేదీ వరకూ 20 ప్రత్యేక మినీ బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ బస్సులో ధర ప్రతిరోజు 150 ట్రిప్పులను మహబూబ్ నగర్, నారాయణపేట్ ల నుంచి మన్నెంకొండ దేవాలయం వరకు తిప్పనుంది.
మన్నెంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున మన్నెంకొండకు వెళ్లేందుకు సిద్హమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ మినీ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ మరిన్ని బస్సులను అవసరం మేరకు తిప్పాలని భావించినట్టు ఆర్ఎం సంతోష్ కుమార్ తెలియజేశారు. కేవలం మినీ బస్సులు మాత్రమే కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఉందని ప్రయాణికులు గమనించాలని సూచించారు. మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం మహబూబ్‌నగర్‌కు 17 కి.మీ దూరంలో ఉంది.
