Site icon Bhakthi TV

ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నేడు ప్రారంభమయ్యాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి పర్యవేక్షణలో.. సమతాకుంభ్‌ 2025 శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 19 వరకు జరుగనున్నాయి. భగవద్రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. కాబట్టి ఆ రోజున ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈ ఏడాది నేటి నుంచి ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవారంభ స్నపనం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను శ్రీరామానుజాచార్యులవారు ప్రారంభించారు.

పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో.. నిత్యం విశేష కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రేపు అంటే ఫిబ్రవరి 10వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, 12వ తేదీ రామానుజ నూత్తందాది సామూహిక పారాయణము, 13న ఆచార్య వరివస్య, 15న శాంతి కళ్యాణ మహోత్సవం, 16న తేదీ ఉదయం వసంతోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం, 18వ తేదీ రథోత్సవం-చక్రస్నాన ఘట్టాలు జరుగుతాయి. అలాగే ఈ పది రోజుల పాటు సుప్రభాతం, అష్టాక్షరీ మంత్ర జపంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నేపత్యంలో ముచ్చింతాల అధ్యాత్మిక శోభతో అలరారుతోంది.

Share this post with your friends
Exit mobile version