Site icon Bhakthi TV

నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయంటే..

ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? ఈ సారి కూడా నవరాత్రులు అయితే తొమ్మిది రోజులు కాదు.. మరి ఎన్ని రోజులు? ఏంటనే విషయాలను తెలుసుకుందాం. ఈ ఏడాది శారదీయ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శారదీయ నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఈ నవ రాత్రులను తొమ్మిది దేవతలకు అంకితం చేస్తారు. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి జీవితంలో అన్ని దు:ఖాలు, బాధలు తొలగిపోతాయని నమ్మకం.

అయితే ఈ ఏడాది అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు కాకుండా పది రోజుల పాటు జరుగనున్నాయి. అంటే సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. మహానవమి అక్టోబర్ 1న రానుంది. అక్టోబర్ 2న విజయదశమి. ఆ రోజునే దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది నవరాత్రి రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజున అరుదైన యాదృచ్చికం ఏర్పడనుంది. ఈ ఉత్సవాలను అదనంగా పది రోజుల పాటు నిర్వహించడానికి కారణంగా సెప్టెంబర్ 24, 25 తేదీల్లో అంటే రోజుల పాటు తృతీయ తిథి ఉండనుంది. ఈ కారణంగానే శారదీయ నవరాత్రుల్లో ఒక రోజు పెరిగింది.

Share this post with your friends
Exit mobile version