Site icon Bhakthi TV

Palmistry Lines : అరచేతిలో ఇలాంటి గుర్తులు ఉన్నాయా… జీవితంలో జరిగే మార్పులు ఊహించలేరు

మీ అరచేతిలో ఈ గుర్తులు ఉన్నాయా? అయితే మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతోంది! | Palmistry Telugu

అరచేతిలోని చిన్న గుర్తులే భవిష్యత్తును సూచిస్తాయని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతున్నది. ముఖ్యంగా అర చేతిలో ధన త్రికోణం ఉంటే, ఆ వ్యక్తికి ధనయోగం బలంగా ఉందని అంటారు. ఆయుషు, బుద్ధి, ధన రేఖలు కలిసి త్రికోణం ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ త్రికోణమే ధనయోగానికి చిహ్నం. అలాగే ఉంగరం వేలి క్రింద ఉన్న సూర్య పర్వతం ఉబ్బెత్తుగా, స్పష్టంగా ఉంటే… అదృష్టం, పేరు ప్రఖ్యాతలు కలుగుతాయని చెబుతారు. హృదయ రేఖ నుంచి సూర్య పర్వతం వైపు వెళ్లే గీతలపై చిన్న త్రికోణాలు లేదా చతురస్రాలు ఉంటే… ఆస్తి, సంపద వేగంగా పెరుగుతుంది. అరచేతిలో వలయాకారపు లేదా గుండ్రని గుర్తులు ఉండటం కూడా అపార ధనయోగానికి సంకేతం. ఈ గుర్తులు ఉన్నవారు ఆర్థికంగా స్థిరంగా ఉండడమే కాకుండా, భవిష్యత్తులో వ్యాపార విజయాలు, సంపద వృద్ధిని పొందుతారని నమ్మకం.

Palmistry Lines
Share this post with your friends
Exit mobile version