Site icon Bhakthi TV

సూర్యగ్రహణం కారణంగా మనకు సూతకం ఉంటుందా?

ఈ ఏడాది ఈ నెలలోనే సూర్యగ్రహణం సంభవించనుందని తెలుసుకున్నాం కదా. భాద్రపద మాసం అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే ఇది భారతదేశంలో మాత్రం కనిపించదు. అయితే కొందరికి మాత్రం జీవితంలో కొన్ని మార్పులను తీసుకొస్తుందని జోతిష్యులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కారణంగా కన్య రాశి , ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారికి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో గ్రహాల కలయిక కారణంగా కన్యా రాశివారు, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో అవకాశాలతో పాటు సవాళ్లను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది.

సూర్య గ్రహణం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏర్పడనుంది. అంటే ఈ సూర్యగ్రహణం పితృ పక్ష ముగింపు రోజున ఏర్పడనుంది. కాబట్టి ఈ గ్రహణానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక భారతదేశంలో సూతకాలం ఉంటుందా? ఉండే అవకాశమే లేదు. దీనికి కారణం ఏంటంటే.. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. సూతకం అనేది గ్రహణం కనిపించే ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని శాస్త్రం చెబుతోంది కాబట్టి భారతదేశంలో నివసించే వారికి ఈ గ్రహణం వల్ల ఎటువంటి సూతక నియమాలు వర్తించవు.

Share this post with your friends
Exit mobile version