Site icon Bhakthi TV

ఐరావతంపై కూర్చొని దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యుడు ఎక్కడున్నాడంటే..

పూర్వం సుబ్రహ్మణ్యస్వామి రాక్షస సంహారానికి కావల్సిన శక్తుల కోసం తల్లిదండ్రులైన శివపార్వతుల గురించి చెన్నై నడిబొడ్డున ఉన్న మైలాపూర్ ప్రాంతంలో తపస్సు చేశాడట. అప్పుడు కుమారుడిని అనుగ్రహించిన పార్వతీపరమేశ్వరులు తమ కుమారునికి వేలాయుధాన్ని ఆయుధంగా ఇచ్చారట. అనంతరం ఆ వేలాయుధంతో రాక్షస సంహారం గావించాడని చెబుతారు. అయితే రాక్షస సంహారానంతరం సింగారవేల్‌గా తిరిగొచ్చాడు. అప్పుడు ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.

అప్పుడు స్వర్గంలో ఇంద్రుడి వాహనమైన ఐరావతంపై దేవసేనతో కలిసి సుబ్రహ్మణ్యస్వామి భూలోకంలోని మైలాపూర్‌కు తిరిగొచ్చాడట. అందుకే ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి.. వల్లీదేవసేనతో కలిసి ఐరావతంపై కూర్చుని దర్శనమిస్తాడు. ఇలాంటి దర్శనం మరెక్కడా లభించదని చెబుతారు. పురాణాల ప్రకారం ఇది అత్యంత అరుదైన దర్శనం అని అంటారు. ఇక్కడి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుంటే తప్పనిసరిగా వివాహం కాని వారికి కల్యాణ యోగం, సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతాయని చెబుతారు. మైలాపూర్ క్షేత్రానికి వెళ్లాలంటే.. ముందుగా చెన్నై చేరుకుని.. అక్కడి నుంచి లోకల్‌గా బస్సులు, ఆటోలు వంటి వాటి ద్వారా మైలాపూర్ కపాలీశ్వరస్వామి ఆలయానికి చేరుకోవచ్చు.

Share this post with your friends
Exit mobile version