Site icon Bhakthi TV

సఫల ఏకాదశి ఎప్పుడు? ఉపవాసాన్ని ఎప్పుడు విడిచి పెట్టాలి?

హిందూమతంలో ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. నెలలో ఏకాదశి ఉపవాసం నెలకు రెండుసార్లు వస్తుంది. ఒకటి శుక్లపక్ష ఏకాదశి.. రెండవది కృష్ణపక్ష ఏకాదశి. ఈ రెండు ఏకాదశిలకు దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాదిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల మనిషి ప్రతి పనిలో విజయం సాధిస్తాడని నమ్ముతారు. అలాగే శ్రీ హరి అనుగ్రహం వల్ల జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చెబుతారు.

ముందుగా మార్గశిర మాసంలోని సఫల ఏకాదశి తిథి ఎప్పుడో తెలుసుకుందాం. హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి మార్గశిర ఏకాదశి తిథి డిసెంబర్ 25వ తేదీ రాత్రి 10.29 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12:43 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో.. సఫల ఏకాదశి ఉపవాసం డిసెంబర్ 26న ఆచరిస్తారు. ఇక ఈ రోజున ఉపవాసం ఆచరించే వారు ఉపవాస దీక్షను మరుసటి రోజున అంటే డిసెంబర్ 27న సూర్యోదయం అనంతరం ద్వాదశి తిథిలో విడిచి పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజున పూజకు శుభ సమయం వచ్చేసి ఉదయం 7.12 నుంచి 9.16 వరకు ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version