Site icon Bhakthi TV

చింతాహరన్ గణేషుడికి కాల్ చేసే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందంటే..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన చింతామణి గణేష్ లేదంటే చింతాహరన్ గణేష్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు చింతామణి గణేష్‌కు కాల్ చేయడం ఎప్పుడు నుంచి ప్రారంభమైందనేది ముందుగా తెలుసుకుందాం. ఈ చింతామణి గణేష్‌కి జర్మనీలో స్థిరపడిన భక్తుడు ఉండేవాడు. జర్మనీకి వెళ్లడానికి ముందు ప్రతిరోజూ ఆయన ఈ ఆలయాన్ని సందర్శించేవాడట. అయితే విదేశాల్లో స్థిరపడిన తర్వాత ఆయనకి ఒకసారి ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన చింతామణి ఆలయ పూజారికి ఫోన్ చేశాడట. తను చాలా కష్టంలో ఉన్నానని.. చింతామణి ప్రభువుతో తన కష్టాన్ని చెప్పుకుంటానని అభ్యర్థించాడు.

భక్తుని భక్తి, భగవంతుడి పట్ల ఉన్న నమ్మకాన్ని గౌరవిస్తూ పండితుడు తన ఫోన్‌ను గణపతి చెవి దగ్గర ఉంచాడు. భక్తుడు తన సమస్యలన్నింటినీ గణపతి బప్పాతో చెప్పుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి.. మళ్ళీ ఆలయ పూజారీకి ఆ భక్తుడి నుండి కాల్ వచ్చింది. చింతామణి గణేష్ తన కోరికను నెరవేర్చాడని చెప్పాడు. తాను ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయట పడినట్లు చెప్పాడు. ఈ విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఈ గణేషుడికి సమస్యను కమ్యునికేట్ చేసుకునే విధానం లేఖల నుంచి ఫోన్‌కి మారిపోయిందట. ఈ ఆలయం రాతి స్తంభాలతో సంక్లిష్టమైన డిజైన్లతో చూడచక్కగా మలచారు. గర్భగుడికి అనుసంధానంతో ఒక భారీ మంటపం ఉంటుంది. నిత్యం సాయంకాలం వేళ ఈ వినాయకుడికి హారతి ఇస్తారు. ఆ సమయంలో హాలంతా భక్తులతో నిండిపోతుంది.

Share this post with your friends
Exit mobile version