Site icon Bhakthi TV

కేరళపురంలోని వినాయకుడి విగ్రహం రంగు మారడం వెనుక కథేంటి?

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలోని శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు వినాయకుడి ఆలయం ఎక్కడ దొరికింది. అది రంగు మారడానికి కారణమేంటో కూడా తెలుసుకుందాం. ట్రావెన్‌కోర్ రాజు కేరళవర్మన్ తంబురాన్ రామేశ్వరం సముద్రంలో పవిత్రస్నానమాచరిస్తుండగా వినాయకుడి విగ్రహం దొరికిందట. ఆరు అంగుళాలు మాత్రమే ఉన్న ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుకి ఇవ్వబోతే దొరికిన వారికే అది దక్కడం ధర్మంగా భావించి.. విగ్రహాన్ని కేరళవర్మన్‌కే ఇచ్చి మరకత గణపతిని సైతం బహూకరించాడట.

ఆ తరువాత కేరళపురం రాజు రెండు గణపతి విగ్రహాలను తీసుకొచ్చి ఒక రాతిపీఠం మీద ప్రతిష్టించాడు. ఆ తరువాత కేరళపురంపై తురుష్కులు దండెత్తి మరకత గణపతిని తీసుకువెళ్లారట. సముద్రంలో దొరికిన గణపతి మాత్రం కేరళపురం రాజు వద్దే ఉండింది. రెండు అంగుళాలు మాత్రమే ఉన్న విగ్రహం కాలక్రమంలో పెరగడం ఆరంభించిందట. ఆ తరువాత ఈ గణేశ విగ్రహం రంగు మారడానికి కూడా కారణం చెబుతారు. అదేంటంటే.. ఈ విగ్రహం చంద్రకాంతం అనే అరుదైన రాయితో తయారు చేయబడిందట. ఈ గణపతిని దర్శించుకుని.. కొబ్బరికాయను లేదా బియ్యం ముడుపు కట్టి చెల్లిస్తే కోరిక నెరవేరుతుందని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version