Site icon Bhakthi TV

ద్వాదశ వ్రతం గురించి వివరించే కథ ఏంటి?

క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసి కల్యాణం వెనుక కథ కూడా ఇదే. తులసిని శ్రీమహాలక్ష్మిగానూ.. ఉసిరి చెట్టును శ్రీమహావిష్ణువుగానూ భావించి వివాహం జరిపిస్తారు. ఈ ఒక్కరోజున దీపారాధన చేసినా కానీ సంవత్సరమంతా చేసిన పుణ్యం వస్తుందట. క్షీరాబ్ది ద్వాదశి మహత్మ్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది. ఆ కథేంటో మనం తెలుసుకుందాం.

శ్రీహరి తన భక్తుల జోలికి వెళితే ఏం చేస్తాడనేది ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంబరీషుని కథ ముఖ్యంగా ద్వాదశ వ్రత మహత్స్యం గురించి చెబుతుంది. అంబరీష చక్రవర్తికి కావల్సినంత సిరి సంపదలు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయట. కానీ వాటిని చూసి ఎప్పుడూ పొంగిపోకుండా శ్రీ మహావిష్ణువు ధ్యానంలోనే ఉండడేవాడట. ఈ క్రమంలోనే ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించదలచి కాళిందీ నదీలో అంబరీష చక్రవర్తి పుణ్యస్నానం చేసి, మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించాడు. మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడి గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించాడు. ఆపై తాను కూడా వ్రతదీక్షను ముగించి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో అనుకోని ఘటన జరిగింది. అది తర్వాత కథలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version