Site icon Bhakthi TV

ఇవాళ సంకష్ట చవితి వ్రతం అంటే ఏమిటి?

ఇవాళ సంకష్ట చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి పండుగను నిర్వహించుకుంటాం. వినాయకుడికి సంబంధించిన అతి పెద్ద పండుగ ఇది. ఇది కాకుండా ప్రతి మాసంలోనూ వినాయక చవితి కాకుండా గణపతిని ఆరాధించుకోవడానికి ఒక రోజు వస్తుంది. అదే సంకష్ట హర చవితి. కొన్ని సందర్భాల్లో వినాయక చవితి అంతా జరుపుకోలేరు. అలాంటి వారు సంకష్ట హర చతుర్థిని జరుపుకుంటారు. దీనిని జరుపుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడంతో పాటు శుభ ఫలితాలను పొందవచ్చు.

అసలు సంకష్ట హర చవితి అంటే ఏమిటి? దీనికి సంబంధించిన పూజను ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా సంకష్ట హర చవితి వ్రతం అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందుగానే వినాయకచవితిని జరుపుకోలేనివారు దీనిని జరుపుకుంటారని చెప్పుకున్నాం కదా. సంకష్ట హర చతుర్థి అంటే సంకటాలను హరించేదని అర్థం. భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక నియమానుసారంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయట. అంతేకాకుండా సంకటాల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని చెబుతారు. స్కంద పురాణంలో వ్యాస మహర్షి సైతం దీని గురించి వివరించారు.

Share this post with your friends
Exit mobile version