
జొన్నవాడ కామాక్షి తాయి ఉపాలయంలో కొన్ని ఉపాలయాలు సైతం ఉన్నాయి. గర్భాలయంలో మొదట లక్ష్మీ గణపతి దర్శనమివ్వగా.. ఎడమవైపు చిన్న మహాలక్ష్మి విగ్రహం ఉంటుంది. మరో చిన్న గర్భగుడిలో మల్లికార్జున స్వామి కొలువుదీరి ఉండగా.. అ్మవారికి కుడి వపున గర్భగుడిలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దాటగానే నిలుచున్న భంగిమలో కామాక్షి దేవి దర్శనమిస్తుంది. అమ్మవారు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా అమ్మవారి ముఖారవందం ఉంటుంది.
కరుణతో కూడిన నయనాలతో సర్వాలంకారాల భూషితురాలై అఖిలాండేశ్వరి అమ్మవారు.. నాలుగు చేతులతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. రెండు చేతుల్లో అంకుశం, పాశం, మరో రెండు చేతుల్లో అభయ హస్తం, మరొకటి శరణాగతి చూపిస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మవారికి ఎదురుగా శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరులు చేతిలో దండంతో దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో దర్శనం పూర్తి చేసుకుని బయటకు వస్తున్నప్పుడు మనం ఎంతో మానసిక ప్రశాంతతతో వస్తామట. ముఖ్యంగా ఈ క్షేత్రంలో నిద్ర చేసేందుకు భక్తులు అధిక ప్రాధాన్యమిస్తారు. సంతానం లేక ఇబ్బంది పడేవారు ఇక్కడ నిద్ర చేస్తే తప్పక సంతానం లభిస్తుందని నమ్మకం.
