Site icon Bhakthi TV

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించే పూజోత్సవాలేంటంటే..

హంసలదీవి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. మాఘ శుద్ధ చవితినాడు వేణుగోపాలస్వామిని పెల్లి కూతురుని చేసి అనంతరం మాఘ పౌర్ణమి నాడు స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ స్వామివారి కల్యాణాన్ని వీక్షించి.. సాగర సంగమంలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అదే రోజున స్వామివారి చక్రస్నానాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అలాగే కల్యాణం నిర్వహించిన మరుసటి నాడు అత్యంత వైభవంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు.

కృష్ణాష్టమి నాడు అత్యంత వైభవంగా జన్మాష్టమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. అలాగే కార్తిక మాసంలో ఆకాశ దీపాలంకరణ సేవలు నిర్వహిస్తారు. వీటిని తిలకించేందుకు రెండు కళ్లూ చాలవు. అలాగే ధనుర్మాసంలో నెల రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు తిరుప్పావై సేవలను నిర్వహిస్తారు. హంసలదీవి వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లాలంటే.. విజయవాడ నుంచి కోడూరు వరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి నిరంతరం సంగమ ప్రదేశం వరకూ ఆటోలు ఉంటాయి. వాటిలో వెళితే సంగమ ప్రదేశాన్ని చేరుకోవచ్చు.

Share this post with your friends
Exit mobile version