Site icon Bhakthi TV

భీముడు ప్రతిష్టించిన ఈ శివలింగం ఆసియాలోనే అతి పెద్దదట..

శివాలయంలో దాదాపుగా ఎక్కడైనా శివుడు లింగరూపంలోనే కొలువుదీరి ఉంటాడు. అయితే మరి ఎక్కడెక్కడ పెద్ద శివలింగాలు కొలువుదీరి ఉన్నాయో తెలుసా? ముందుగా ఆసియాలోనే అతిపెద్ద శివలింగం ఎక్కడుందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో పృథ్వీనాథ్ ఆలయంలో ఆసియా ఖండంలోనే అతి పెద్ద శివలింగం ఉంది. ఈ శివలింగం ఈనాటిది కాదు.. ద్వాపరయుగం నాటిదని చెబుతారు. ఈ శివయ్యని స్వయంగా పాండవుల మధ్యముడు భీముడు ప్రతిష్టించాడని చెబుతారు. ఈ శివలింగానికి ఆ సమయంలో కుంతీ దేవితో పాటు పాండవులు పూజలు చేశారని పురాణాల కథనం.

కోరిన కోర్కేలు తీర్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్న ఈ మహాభారతం నాటి ఈ శివలింగం విశిష్టతను గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ద్వాపరయుగం నాటి శివలింగాన్ని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఈ ఆలయంలో శివలింగం 5.4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలోని శివయ్య భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం. అయితే 5.4 అడుగుల ఎత్తైన శివలింగం ఆసియాలోనే పెద్దదేంటా? అనే అనుమానం కలగవచ్చు. ఇది పైకి మాత్రమే 5.4 అడుగులు.. మొత్తంగా ఈ శివలింగం 69 అడుగులకు పైనే.. 64 అడుగులు భూమికి దిగువను ఉంటుందట.

Share this post with your friends
Exit mobile version