Site icon Bhakthi TV

ఈ శివాలయం మిస్టరీయే వేరప్పా.. అభిషేక జలం చిటికెలో మాయం

శివుడిని అభిషేక ప్రియుడని, భోళా శంకరుడని పిలుస్తారు. ఒక చెంబు నీళ్లతో అభిషేకించినా పొంగిపోయి వరాలిచ్చేస్తాడు కాబట్టి ఆయనకు ఆ పేర్లు. శివాలయాల విషయానికి వస్తే నగరాల్లో అయితే వీధికొకటి.. గ్రామాల్లో అయితే ఊరికొకటి ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని మిస్టరీని కలిగి ఉంటాయి. అలాంటి ఒక మహిమాన్వితమైన శివాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఎక్కడుందా ఆలయం? ఏంటా మిస్టరీ.. అంటారా?

ముందే చెప్పుకున్నాం కదా.. చెంబుడు నీళ్లతో అభిషేకిస్తే శివయ్య పొంగిపోయి వరాల జల్లు కురిపిస్తాడని.. ఈ ఆలయంలో చెంబుడు నీళ్లు కాదు.. గంగాళం నీళ్లు తెచ్చి పోసినా కూడా చటుక్కున మాయమవుతుంది. ఎక్కడికి వెళుతుందంటారా? అదే కదా మిస్టరీ. శాస్త్రవేత్తలు సైతం ఛేదించలేకపోయిన మిస్టరీ ఇది. వాస్తవానికి ఏ ఆలయంలో అయినా అభిషేకించిన జలం శివుని పానవట్టం నుంచి బయటకు వెళ్లడానికి ఒక ఏర్పాటు అనేది తప్పక ఉంటుంది. ఈ ఆలయంలో అలాంటి ఏర్పాటేం లేదు. అయినా సరే నీళ్లు మాత్రం అక్కడ కనిపించవు. ఇంతకీ ఆ ఆలయం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్రంలో, మెదక్ జిల్లాలో నిజాంసాగర్ వెనుక కొప్పోలులో ఉన్న ఉమాసంగమేశ్వర ఆలయం. ఇదొక గుహలో ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version