
ఆంజనేయుడు ఆ జన్మ బ్రహ్మచారి. ఆయన తన గురువుగా సూర్యుడిని ఎంచుకుని ఆయన నుంచి విద్యను అభ్యసిస్తాడు. హనుమంతుడు ఏకసంథాగ్రాహి. దేనినైనా ఇట్టే పట్టేసేవాడు. అలాంటి హనుమ ఆకాశంలో తిరుగుతూ సూర్యుని నుంచి నవ వ్యాకరణలలో భాగంగా ఎనిమిది వ్యాకరణాలు అవలీలగా నేర్చుకున్నాడు. ఇక చివరిది, తొమ్మిదవ వ్యాకరణం వంతు వచ్చేసింది. దీనిని నేర్చుకోవాలంటే వివాహితుడై ఉండాలి. కానీ ఆయన ఆజన్మ బ్రహ్మచారి. వివాహానికి ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించడు. వివాహం చేసుకోకుంటే నేర్చుకున్న విద్యంతా అసంపూర్ణంగానే మిగిలిపోతుంద.
అప్పుడు సూర్యుడుతన కిరణాల నుంచి సువర్చల అనే కన్యను సృష్టిస్తాడు. ఆమెకు భౌతిక రూపం అంటూ ఏమీ ఉండదు. ఆమె కేవలం తన తేజస్సుతో ప్రకాశిస్తుంది అంతే. భౌతిక రూపం లేని కన్యతో వివాహం కాబట్టి హనుమంతుడి నిష్టకు ఎలాంటి భంగమ వాటిల్లదు. ఇదే విషయాన్ని హనుమకు సూర్యుడు వివరించడంతో అంగీకరిస్తాడు. సూర్యుడు హనుమ, సువర్చల వివాహం జరిపిస్తాడు. ఆ తరువాత హనుమంతుడు తొమ్మిదో వ్యాకరణాన్ని పూర్తి చేసి తపస్సుకు వెళ్లిపోయాడు. సువర్చల సైతం తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయిందట. అలా హనుమంతుడు తన బ్రహ్మచర్య నిష్టను కొనసాగించాడు.
