
శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. అయితే కొందరు ఈ మాసమంతా మాంసాహారం స్వీకరించరు. కొందరు మాత్రం శుక్రవారాల్లో మాంసాహారాన్ని మానేస్తారు. వాస్తవానికి కూడా ఈ మాసంలో మాంసాహారం తినకూడదని చెబుతారు. అసలు ఎందుకు ఈ మాసంలో మాంసం తినకూడదో తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో మాంసాహారం తినడం అశుభం, నిషిద్ధమని చెబుతారు. దీనికి కారణం ఈ నెలంతా దైవ భక్తి, తపస్సు వంటివాటిపైనే మనసును లగ్నం చేయాలట. మాంసాహారం స్వీకరిస్తే మనసు శాంతిని కోల్పోతుందని చెబుతారు. ఈ మాసంలో ఏ జీవిని చంపినా పాపంగా భావిస్తారు. ఎందుకంటే ఈ నెల దైవభక్తి, తపస్సు, సంయమనం, ఆత్మశుద్ధికి సమయం. మాంసం మనస్సును అశాంతంగా ఉండేలా చేస్తుంది. మాంసాహారం వంటి తామసిక ఆహారాలు సోమరితనానని, చంచలత్వాన్ని పెంచుతాయని చెబుతారు. పూజ సమయంలో ఏకాగ్రత కోల్పోతామట. అందుకే శ్రావణ మాసంలో మాంసాహారం స్వీకరించకూడదని చెబుతారు.
