Site icon Bhakthi TV

ఇష్టకామేశ్వర దేవి యాత్ర ఎలా ఉంటుందంటే..

శ్రీశైలానికి వెళ్లే వారంతా ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే ఈ యాత్ర అత్యంత సాహసోపేతమైది. దట్టమైన అటవీ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకుని ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుందని నమ్మకం. అందుకే ఈ అమ్మవారిని ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. ఈ అమ్మవారు ఇక్కడ పరమేశ్వరుడు, పార్వతీదేవికి ప్రతిరూపంగా వెలసి ఉన్నారని భావిస్తారు. ఈ అమ్మవారు అప్పట్లో సిద్ధులతో పూజలు అందుకున్నారని చెబుతారు. ప్రస్తుతం మాత్రం శ్రీశైలం వెళ్లిన వారంతా దాదాపుగా ఈ అమ్మవారి గురించి తెలిస్తే దర్శించుకుని వస్తారు.

ఇష్టకామేశ్వర దేవి యాత్ర ఎలా ఉంటుందంటే..

శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల కొండల్లో ఒక గుహలో ఇష్టకామేశ్వరి దేవి వెలిసి ఉంది. ఇక్కడ అమ్మవారు.. చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. అమ్మవారు ఒకవైపున ఉన్న రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్ష మాలతో దర్శనమిస్తుంది. ఇష్టకామేశ్వరీదేవి చిరునవ్వులు చిందిస్తూ.. తపోభంగిమలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. చీకటిగా ఉన్న గుహలో దీపపు వెలుగు మధ్య అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఇక్కడికి వెళ్లగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక భావనలోకి మనసు వెళ్లిపోతుంది. ఈ గుహ పరిసర ప్రాంతాల్లో కాసేపు కూర్చుని ధ్యానం చేసుకుంటే మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది.

Share this post with your friends
Exit mobile version